బడ్జెట్‌లో క్యాలెండర్ పెట్టి పథకాలు అమలు చేశాం. : వైఎస్ జగన్ 22 h ago
AP: తమ పాలనకు, బాబు పాలనకు మధ్య తేడా ప్రజలు గుర్తించారన్నారు వైఎస్ జగన్. అవినీతి కోసం మాత్రమే వాళ్లు అధికారంలో ఉన్నారని, వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రూ.100 కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఒత్తిళ్ల మధ్య మన పరిపాలన సాగిందని, ప్రజలకు ఇచ్చిన మాటను ఎప్పుడూ వదిలి పెట్టలేదని గుర్తు చేశారు. దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశామని, ముందుగానే క్యాలండర్ ఇచ్చి హామీలను అమలు చేశామని పేర్కొన్నారు.